CTR: బెంగళూరులో దోపిడీకి గురైన రూ.7 కోట్ల నగదును కుప్పంలో కర్ణాటక పోలీసులు రికవరీ చేశారు. కూర్మాయిపల్లెకు చెందిన నవీన్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన ఇళ్లు తాళం వేసి ఉండగా తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ రూ.5.56 కోట్ల మేర నగదు రికవరీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.