NZB: క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం NZB, కామారెడ్డి జిల్లా స్థాయి అండర్ 14 క్రికెట్ జట్టు ఎంపికను నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి వెంకట్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి సురేష్ బాబు తెలిపారు. ఈ ఎంపికలు జిల్లా కేంద్రంలోని GG కాలేజ్ గ్రౌండ్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.