MNCL: ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు జన్నారం మండల కేంద్రంలో పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ జన్నారం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముజఫర్ ఖాన్, మేకల మాణిక్యం తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు జన్నారంలోని రైతు వేదికలో మహిళలకు ఇందిరమ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేస్తారన్నారు. ఆ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనాలని వారు కోరారు.