KKD: ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. దీనిలో భాగంగా CRC పథకం ద్వారా తీర రక్షణ చర్యలు, యువతకు స్పీడ్ బోట్, స్కూబా డైవింగ్‌లో శిక్షణ కల్పిస్తారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సముద్రంలో చేప పిల్లలను విడుదల, రూ.2 కోట్లతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టనున్నారు.