ATP: ఎమ్మెల్యే బండారు శ్రావణి శుక్రవారం సంజీవపురం సమీపంలోని సుబ్బారాయసాగర్ను సందర్శించారు. గేట్లు మొరాయించడంపై అధికారులతో చర్చించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. రైతన్నలు ఆందోళన చెందవద్దని, నీరు వృథా కాకుండా చూసేందుకు హోస్పేట నుంచి నిపుణులను రప్పించి మరమ్మతులు చేపట్టామని తెలిపారు.