WGL: ఖానాపురం మండలంలోని బాలు తండాకు చెందిన వీ.నితిన్ (21) అనే యువకుడు డిగ్రీ చదువుతున్నాడు. కుటుంబ సభ్యులతో గొడవపడి ఎలుకల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటన ఈ నెల 14న జరిగగా.. అతడిని ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు స్థానికులు వెల్లడించారు.