NGKL: అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే వంశీకృష్ణ చేతుల మీదుగా చీరల పంపిణీ జరుగనుంది. శనివారం ఉదయం 10:00 గంటలకు బల్మూరు మండల కేంద్రం, స్థానిక ఎంపీడీవో కార్యాలయం, మధ్యాహ్నం 2:00 గంటలకు లింగాల మండల కేంద్రం, సాయంత్రం 4:00 గంటలకు అచ్చంపేట మండలం ఆఫీస్ ఆవరణంలో చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు.