MDK: ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్సింగి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన ఎరుగమొల్ల మధు(38) శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని చనిపోయాడు. ఆత్మహత్యకు గల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మృతుడికి భార్య శ్యామల, ఇద్దరు కొడుకులు,ఒక కుమార్తె ఉన్నారు.