అనంతపురం సర్వజన ఆస్పత్రిలో MP అంబికా లక్ష్మీనారాయణ నిధులతో ఏర్పాటు చేసిన మదర్స్ మిల్క్ బ్యాంకును MLA బండారు శ్రావణి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె సేవలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో మూడు మిల్క్ బ్యాంకులు ఉండగా, అనంతపురంలో ఆదరణ పెరగడం సంతోషకరమన్నారు. పాలు సేకరణకు కృషి చేస్తున్న RMO డాక్టర్ గుజ్జల హేమలతను, సిబ్బందిని అభినందించారు.