డెఫ్లింపిక్స్లో భారత యువ షూటర్ శౌర్య సైని సత్తా చాటాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో రజతం సాధించాడు. జర్మనీకి చెందిన మథియస్ ఎరిక్ హెస్ స్వర్ణం గెలుచుకున్నాడు. కుశాగ్రసింగ్ రజావత్ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు 4 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్యాలు సహా మొత్తం 13 పతకాలు కైవసం చేసుకుంది.