SRPT: ప్రజలతో పోలీసులు సత్సంబంధాలు కలిగి ఉండాలని, అదే క్రమంలో శాంతి భద్రతల విషయంలో రాజీపడొద్దని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు. శుక్రవారం శాలిగౌరారం పోలీస్ స్టేషన్లో జరిగిన వార్షిక కేసుల తనిఖీ కార్యక్రమంలో భాగంగా ఆయన స్టేషన్ ను సందర్శించి తనిఖీ చేశారు. అలాగే స్టేషన్ లో నిర్వహిస్తున్న రిజిస్టర్ల వివరాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు.