MHBD: తొర్రూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో రోడ్డు వెంట ఎండిన చెట్లు ఎప్పుడు కూలిపోతాయేనని వాహనదారులు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. భారీ వృక్షాలు నేలకూలితే రాకపోకలకు తీవ్ర అంతరాయంతో పాటు స్థానికులు గాయాలపాలయ్యే ప్రమాదం ఉందని వారు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి ఈ చెట్ల తొలగింపునకు చర్యలు చేపట్టి ప్రమాదాల బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.