సబ్జా గింజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి నీటిలో నానితే మెత్తని జెల్ లాంటి పదార్థంలా మారుతాయి. ఈ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. సబ్జా గింజలను తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. బరువు తగ్గేందుకు ఈ గింజలు సహాయపడుతాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది.