సైనిక బలగాలను ఆధునికీకరిస్తున్న భారత్, అమెరికా నుంచి జావెలిన్ క్షిపణి వ్యవస్థను కొనుగోలుకు సిద్ధమైంది. ఆధునిక ట్యాంకు విధ్వంసక క్షిపణుల్లో జావెలిన్ ఒకటి. దీనిని సైనికుడి భుజంపై నుంచి సులువుగా ప్రయోగించవచ్చు. దీని పరిధి 65 మీటర్ల నుంచి 4 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది టార్గెట్ను 94 శాతం ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది.