ASR: కార్తీక మాసం శుక్రవారంతో పూర్తయిన సందర్భంగా గూడెం కొత్తవీధి మండలం సీలేరులో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో కార్తీక మాసం ఆచరిస్తున్న భక్తులు భక్తిశ్రద్ధలతో స్నానాలు ఆచరించి, నదిలో దీపాలు వదిలారు. అధిక సంఖ్యలో మహిళా భక్తులు సీలేరు రిజర్వాయర్ వద్ద 365 వత్తులు దీపాలు వెలిగించి, నదిలో వదిలారు.