GNTR: తెనాలిలో ఆరేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో బిల్లా డేవిడ్ రాజుకు స్థానిక ఫోక్సో కోర్టు న్యాయమూర్తి 20 ఏళ్ల జైలు శిక్ష మరియు రూ.10 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పును వెల్లడించారు. 2021లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి విచారణలో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేశారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారం కూడా ఇవ్వాల్సి ఉంది.