PPM: ప్రజారోగ్యం దృష్ట్యా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. కుమ్మరిగుంట, చినకేర్జిల, పెదఖేర్జీల గ్రామాల్లో శుక్రవారం సందర్శించి వైద్య సేవలు అందుతున్న తీరుపై పరిశీలించారు. సంచార చికిత్సా శిబిరాన్ని సందర్శించి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై ఆరా తీశారు.