VSP: శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ విశాఖలో బాటసారులకు పోషక విలువలు కలిగిన రాగి జావను ఒక్క రూపాయికే అందిస్తోంది. పేద ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంస్థ అధ్యక్షులు అప్పారావు శుక్రవారం తెలిపారు. అలాగే, డిసెంబర్ 1 నుంచి మాల ధారణ భక్తులందరికీ ఉచితంగా అల్పాహారం కూడా అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.