SKLM: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఆమదాలవలస ఎమ్మెల్యే, PUC చైర్మన్ రవికుమార్ అన్నారు. శుక్రవారం కడప జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక కలెక్టరేట్లో విశ్వవిద్యాలయాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన బోధన, విద్యార్థుల ప్రవేశాలు మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి పెట్టాలని తెలిపారు.