W.G: జిల్లా సర్వే & ల్యాండ్ రికార్డ్స్ అధికారి కొండా జాషువా శుక్రవారం ఉండి తహశీల్దార్ కార్యాలయంలో రీ-సర్వే జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. సర్వే పురోగతి సాధించడానికి ఆయన పలు సూచనలు చేశారు. రీ సర్వే ఆవశ్యకతను రైతులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కె. నాగార్జున, రీ సర్వే బృందం అధికారులు పాల్గొన్నారు.