PPM: సీతానగరం మండలం జోగింపేట బాలుర గురుకుల పాఠశాలను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు పెడుతున్న పౌష్టికాహారాన్ని పరిశీలించి రుచి చూశారు. అనంతరం వసతి గదులను, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులు పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని అన్నారు.