GNTR: అన్నక్యాంటీన్ల వద్ద మౌలికవసతుల కల్పనకు ఇంజినీరింగ్ అధికారులు చొరవ చూపాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. ఆర్టీఓ ఆఫీస్ సమీపంలోని అన్న క్యాంటీన్‌ను కమిషనర్ శుక్రవారం పరిశీలించారు. ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా లైటింగ్, ఫ్యాన్లు ఉండాలని తెలిపారు.