KNR: చిగురుమామిడి మండలం సుందరగిరి జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన జనవిజ్ఞాన వేదిక సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో ఇందుర్తి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఈ పాఠశాల నుంచి సాయి వర్షిత, సుస్మిత, అక్షిత్‌లు జిల్లా స్థాయికి ఎంపిక కావడం విశేషం. మండలంలోని 12 పాఠశాలల నుంచి మూడు స్థానాలు ఈ పాఠశాలకే దక్కాయి.