SKLM: ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్టు చేసి 7.160 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నంనాయుడు వెల్లడించారు. రైల్వే స్టేషన్లో గల రెండవ ప్లాట్ఫారం వద్ద ఉన్న మట్టి రోడ్డు నుంచి ట్రైన్‌కు వెళ్తున్న సమయంలో ఎస్సై ముకుందరావు పట్టుకున్నారని వివరించారు.