KMM: లక్కీ డ్రా’ పేరుతో వచ్చే మోసాలను నమ్మి ప్రజలు నష్టపోవద్దని ఖమ్మం వన్ టౌన్ సీఐ కరుణాకర్ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం తెలిసిన వెంటనే డయల్- 100కు లేదా సమీప పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయాలని, వివరాలు తెలిపిన వారి ఫోన్ నంబర్లు గోప్యంగా ఉంచబడతాయని సీఐ తెలిపారు.