NDL: మహానంది మండలం ఆర్ఎస్ గాజులపల్లి సమీపంలోని వాటర్ ప్లాంట్ మలుపు వద్ద ప్రమాదవశాత్తు కారు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం సాయంత్రం మహానంది నుంచి బోయలకుంట్లకు వస్తుండగా అదుపుతప్పి పంట పొలాల్లోకి వెళ్లిందని ప్రయాణికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న మహానంది ఎస్సై రామ్మోహన్ రెడ్డి కారును బయటికి తీశారు.