KRNL: కర్నూల్ సీఐ జే.శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగిస్తూ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం శంకరయ్య కర్నూలు వీఆర్లో ఉంటూ సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. శంకరయ్యను క్రమశిక్షణా చర్యలపై డిస్మిస్ చేసినట్లు తెలిపారు.