MDCL: నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం శివారులో అప్పుల బాధతో మల్లేశ్, సంతోషి అనే దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. భార్య అక్కడికక్కడే మృతి చెందగా, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త చనిపోయారు. కుమారుడు ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.