‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుందని ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తెలిపారు. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్నారు. దర్శకుడు సాయిలు ఈ చిత్రాన్ని చాలా సహజంగా తీశారని కొనియాడారు. థియేటర్లలో తప్పకుండా చూడాల్సిన మూవీ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ రావడంతో చిత్రబృందం సంబరాలు చేసుకుంది.