AP: కడప జిల్లా పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను సర్వీసు నుంచి తొలగిస్తూ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనను తొలగించినట్లు పేర్కొన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబుకు శంకరయ్య లీగల్ నోటీసులు పంపారు. సీఎం తనపై చేసిన ఆరోపణల వల్ల పరువునష్టం వాటిల్లిందని నోటీసుల్లో తెలిపారు.