వర్షం పడినా లెక్క చేయకుండా ‘అఖండ 2’ ట్రైలర్ రిలీజ్ వేడుకకు వచ్చిన అభిమానులందరికీ బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలు, ప్రకృతి, ధర్మం జోలికి వస్తే భగవంతుడు మనిషిలో ఆవహిస్తాడని చెప్పే సినిమా ‘అఖండ’ అని అన్నారు. సనాతన హైందవ ధర్మం ప్రధానాంశంగా ‘అఖండ 2’ రూపొందిందని వెల్లడించారు. తన ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుందని పేర్కొన్నారు.