ELR: యువత భవిష్యత్తును అంధకారం చేసే గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో శుక్రవారం మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి పాఠశాల, కళాశాలలో పోస్టర్లు, సమావేశాల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్నారు.