AP: మంత్రి నారా లోకేశ్ విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని అన్నారు. యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి త్వరలో చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. విద్యా సంస్థల్లో రాజకీయ కార్యకలాపాలు నిషేధమని స్పష్టం చేశారు. టీచర్లకు బోధనేతర బాధ్యతలు ఉండవని తెలిపారు.