BDK: అశ్వాపురం మండలంలోని మిట్ట గూడెం గ్రామపంచాయతీ పాయం మంగయ్య గుంపు గ్రామంలో దుప్పి మాంసం విక్రయిస్తుండగా ఫారెస్ట్ అధికారులు దాడులు నిర్వహించి దుప్పి మాంసాన్ని విక్రయిస్తున్న సప్క వీరస్వామిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు శుక్రవారం వెల్లడించారు. అతని వద్ద నుంచి సుమారు 10 కిలోల మాంసం, దుప్పి తల, కాళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.