TPT: మాలవ్యాజీ స్కూల్ విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి నగరపాలక కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. పాఠశాలను శుక్రవారం పరిశీలించిన ఆమె ఊట నీరు–మురుగునీరు రాకుండా ఇంజినీరింగ్ విభాగంతో తాత్కాలిక మరమ్మతులు చేయించామని చెప్పారు. పాఠశాల పక్కనే ఉన్న ఊటగుంట వల్ల నీరు తరగతి గదుల్లోకి వస్తోందని గుర్తించినట్లు పేర్కొన్నారు.