AP: అక్రమార్జన కేసులో రాష్ట్ర వైద్య మౌలిక వసతుల అభివృద్ది సంస్థ జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టాలనే అభియోగాలపై వచ్చిన సమాచారం మేరకు HYD, విశాఖ, విజయవాడలోని సూర్యకళకు చెందిన, బంధువుల ఇళ్లల్లో సోదాలు జరిపారు. నాలుగు చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.