SRD: ప్రతి ఒక్కరు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పటాన్ చెరు సీఐ వినాయక రెడ్డి అన్నారు. పటాన్ చెరు పారిశ్రామిక వాడలో కార్మికులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. మత్తు పదార్థాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దని చెప్పారు. మహిళలు ఎలాంటి వేధింపులకు గురైన 8712656772 నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు.