అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను RBI హెచ్చరించింది. ఇప్పటికే ఇలాంటి సంస్థల జాబితాను విడుదల చేసిన RBI తాజాగా ఈ లిస్ట్‌లో 7 ప్లాట్‌ఫామ్స్‌ను చేర్చింది. దీంతో వీటి సంఖ్య 95కు చేరింది. వీటిలో స్టార్‌నెట్ FX, క్యాప్‌ప్లేస్, మిర్రరాక్స్, ఫ్యూజన్ మార్కెట్స్ వంటివి ఉన్నాయి.