RR: షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ పరిధిలో శంషాబాద్ డీసీపీ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఫరూఖ్ నగర్ ప్రాంతాల్లో పలుచోట్ల తిరుగుతూ వాహనాలను తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం లక్ష్యంగా ఇంటింటి తనిఖీలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతలకు ఆటంకాలు కలిగిస్తే చర్యలు తప్పవని అన్నారు.