KMM: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బోడేపూడి కాలనీలో శుక్రవారం సీపీఎం నేతలు పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలపై సర్వే నిర్వహించారు. వీధిలైట్లు లేక కాలనీవాసులు పది రోజులుగా చీకట్లో కాలం గడుపుతున్నారని, వెంటనే వీధిలైట్లు ఏర్పాటు చేయాలని సీపీఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని కోరారు.