GDWL: మల్దకల్ మండల కేంద్రంలోని ఆదిశిలా క్షేత్రంలో కొలువైన తిమ్మప్ప స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 25 నుంచి డిసెంబర్ 9 వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా డిసెంబర్ 2న స్వామి కళ్యాణం, 3న తెప్పోత్సవం, 4న రాత్రి 11:00 గంటలకు రథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఛైర్మన్ ప్రహ్లాద రావు ఓ ప్రకటనలో తెలిపారు.