HYD: శ్రీరాముడు, శ్రీకృష్ణుడిని ఉద్దేశించి రాజమౌళి చేసిన వ్యాఖ్యలను మాధవీలత తప్పుపట్టారు. వాళ్లు పురాణ పురుషులని.. మన నాగరికతకు ఆత్మ అని తెలుపుతూ మరోసారి రాజమౌళికి కౌంటర్ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. మీరు చేసిన వ్యాఖ్యలకు ఆంజనేయస్వామి జవాబిస్తారని అన్నారు. రాజమౌళి ఇంకొకసారి ఇలా మాట్లాడకుండా భగవంతుని ఉనికిని తెలుసుకుంటారని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు.