KRNL: పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా చేరేలాగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని దిశా కమిటీ సమావేశంలో కర్నూలు ఎంపీ నాగరాజు సూచించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతి, ప్రజా సమస్యలపై సమీక్ష జరిగింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం అవసరమైన శాఖలు నివేదిక ఇవ్వాలని కోరారు.