గుంటూరు జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు సజావుగా జరిగేలా పూర్తిస్థాయిలో పకడ్బందీ చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. శుక్రవారం మేడికొండూరు మండలం, డోకుపర్రు గ్రామంలోని శ్రీ విజయ వెంకటేశ్వర కాటన్ మిల్స్ వద్ద ప్రత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.