RR: కొండాపూర్లో పార్కులు, ప్రజావసరాల కోసం ఉద్దేశించిన దాదాపు 4 ఎకరాల స్థలాన్ని కబ్జాదారుల నుంచి హైడ్రా కాపాడింది. ఎకరం రూ.200 కోట్లు విలువ చేసే ఈ భూమి మొత్తం విలువ సుమారు రూ.700 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కబ్జా ప్రయత్నాలను హైడ్రా అడ్డుకొని భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. పార్కు స్థలాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.