SKLM: జాబ్ కార్డుల కోసం ధరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సుధాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో గల అన్ని గ్రామ పంచాయితీలలో ఈ నెల 22న గ్రామ సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆయా పంచాయతీలలో గల ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, మండల స్థాయి అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.