MBNR: పాలమూరు విశ్వవిద్యాలయానికి శనివారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు రానున్నారని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాయప్ప తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై అవగాహన కార్యక్రమం మ.2 గంటలకు లైబ్రరీ ఆడిటోరియంలో జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవులు హాజరవుతారని, బీసీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.