NLG: రాష్ట్ర మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా నల్గొండ మండలం అప్పాజీపేటకు చెందిన పోలే సత్యనారాయణ ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లాలో ఆ యూనియన్ 4వ మహాసభలలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అనునిత్యం పోరాడుతానని ఆయన అన్నారు.