HYD: వాహనాల రాకపోకలకు మెరుగైన రహదారుల వ్యవస్థను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఫతేనగర్ ఫ్లైవర్ కింద సనత్‌నగర్‌లోని లోధా క్లబ్ హౌస్ నుండి మెథడిస్ట్ చర్చి వరకు రూ. 33 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ శంకుస్థాపన చేశారు.