SKLM: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే మత్స్యకారులకు స్వర్ణ యుగం సాధ్యమైందని మత్స్య శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ మత్స్యకారులు దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.